Sunday, December 29, 2024
HomeSpiritualమ‌హిళ‌లు శ‌నివారం త‌ల‌స్నానం చేయొచ్చా..? ఒక‌వేళ‌ చేస్తే ఏమవుతుంది..?

మ‌హిళ‌లు శ‌నివారం త‌ల‌స్నానం చేయొచ్చా..? ఒక‌వేళ‌ చేస్తే ఏమవుతుంది..?

హిందూ సంప్ర‌దాయంలో మ‌హిళ‌లు త‌ల‌స్నానం చేసిన త‌ర్వాత‌నే పూజ గ‌దిలోకి అడుగుపెడుతారు. వారాల్లో శ‌నివారాన్ని ఎంతో ప‌విత్రంగా భావిస్తారు స్త్రీలు. శ‌నివారం రోజు త‌ల స్నానం చేసి, త‌మ‌కు ఇష్ట‌మైన దేవుడిని ఆరాధిస్తారు. అయితే శ‌నివారం మ‌హిళ‌లు త‌ల స్నానం చేయ‌డం వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆ ఇంట్లో కూడా అన్ని అశుభాలే క‌లుగుతాయ‌ని చెబుతున్నారు. మ‌రి మ‌హిళ‌లు శ‌నివారం త‌ల స్నానం చేయ‌డం వ‌ల్ల ఎలాంటి న‌ష్టాలు ఉన్నాయో తెలుసుకుందాం..

ఆయుష్షు త‌గ్గే అవ‌కాశం

పురాణాల ప్రకారం శనివారం ఆడవాళ్లు తల స్నానం చేయడం చేస్తే.. ఆయుష్షు తగ్గుతుందట. కాబట్టి ఆడవారు శనివారం రోజున తల స్నానం చేయకుండా ఉండటం బెటర్. ఈ రోజు తల స్నానం చేస్తే.. శని దేవుడికి కోపం వస్తుంది అని కూడా అంటారు. అందుకే వీలైనంత వరకూ శనివారం తల అంటుకోకండి.

ఆర్థిక స‌మ‌స్య‌లు..

శాస్త్రాల ప్రకారం.. శనివారం తల స్నానం చేయడం ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారట. ఒక వేళ మీరు తలస్నానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తప్పవట. మీరు మరింత ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం.. శనివారం తల స్నానం చేయకూడదు.

ఒక్క శ‌నివార‌మే కాదు.. ఈ రోజుల్లో కూడా

అదే విధంగా మంగళవారం, గురువారం రోజు కూడా తల స్నానం చేయకూడదు. ఒక వేళ గురువారం తల స్నానం చేస్తే మీ ఇంట్లో సుఖసంతోషాలు కరువవుతాయని చెబుతున్నారు. ఇంట్లో పలు రకాల సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. మంగళవారం రోజు తల స్నానం చేయాల్సి వస్తే.. అది భర్త జీవితంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.

RELATED ARTICLES

తాజా వార్తలు