నేడే T20 world cup ఫైనల్ మ్యాచ్ – ఇండియా వర్సస్ సౌత్ ఆఫ్రికా
T20 world cup ఫైనల్ ఇండియా, సౌత్ ఆఫ్రికా మధ్య శనివారం బ్రిడ్జ్ టౌన్ (బార్బాడోస్ ఐలాండ్) నగరం లోని కెన్సింగ్టన్ ఒవల్ స్టేడియంలో జరగనుంది. ఈ 9వ ఐసిసి మెన్స్ టి-20 వరల్డ్ కప్ కు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా(USA), వెస్టిండీస్(WI) సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ ప్రపంచ కప్ సీజన్ జూన్ 1 నుండి మొదలైంది.
ఇండియా టి-20 వరల్డ్ కప్ టైటిల్ ను 2007 లో మొదటిసారిగా గెలుచుకుంది. 2013లో ICC Champions Trophy (దీనిని మిని వరల్డ్ కప్ అటుంటారు) ని గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన వరల్డ్ కప్ టోర్నీలలో సెమి ఫైనల్స్, ఫైనల్స్ వరకు వచ్చింది. గత సంవత్సరం ODI World Cup లో ఫైనల్ వరకు వచ్చిన టీం ఇండియాకు ఓటమి ఎదురుకాగా క్రికెట్ ప్రియులకు హార్ట్ బ్రేక్ అయింది. ఈ విధంగా టీం ఇండియా ఇటీవల కాలంలో ఏ టైటిల్ ను గెలుచుకోలేదు, ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనే ఆటతీరును కనబరుస్తూ కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో ఇప్పటివరకు జరిగిన లీగ్ మ్యాచ్ లలో బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొన్నది.
మరొకవైపు సౌత్ ఆఫ్రికా 7 సార్లు వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ లో ఓడిపోతూ మొదటిసారిగా ఫైనల్స్ లోకి ఎంటర్ అయింది. శనివారం కెన్సింగ్టన్ ఒవల్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్ లో ఇండియా, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడనున్నాయి.
ఫైనల్ మ్యాచ్ లో ఈ రెండు జట్లు తలపడడం ఇదే మొదటిసారి. ఇదివరకు 2014 టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ఇండియా సౌత్ ఆఫ్రికా ఆడినప్పుడు ఇండియా విజయం సాధించింది. ఇప్పటి వరకు జరిగిన లీగ్ మ్యాచ్ లలో రెండు జట్లు తమ గ్రూప్ లో అత్యధిక పాయింట్ లను నమోదు చేశాయి. ఇండియా లీగ్ దశలో కెనడాతో మ్యాచ్లో పరాజయం పొందగా, సౌత్ ఆఫ్రికా అప్రతిహతంగా విజయాలను కొనసాగిస్తూ ఫైనల్ రేస్ కు చేరుకుంది. ఫైనల్ లో విన్ అయిన టీం టి20 వరల్డ్ కప్ టైటిల్ ను కైవసం చేసుకుంటుంది.
వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఆదివారం నాడు రిజర్వ్ డే గా ఉంచారు. అంటే శనివారం మ్యాచ్ లో అంతరాయం ఏర్పడితే ఆదివారం కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ టై గా తేలితే, సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేలుస్తారు. సూపర్ ఓవర్ లో టై అయితే మరొక సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. సూపర్ ఓవర్ నిర్వహణకు వాతావరణం సహకరించకపోతే ఇరు పక్షాలను జాయింట్ విన్నర్ గా ప్రకటిస్తారు.