Prabhas| యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయనకి ఇప్పుడు దేశ విదేశాలలో ఫాలోయింగ్ ఉంది. వరుస ఫ్లాపులు వచ్చిన కూడా ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సలార్ చిత్రం మళ్లీ ప్రభాస్‌ని ఆకాశానికి ఎత్తేసింది. భారీ యాక్షన్ సినిమాగా సలా చిత్రం రూపొందగా, ఈ సినిమాకు కెజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేశారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా 2023 డిసెంబర్ 22న విడుదలై పెద్ద హిట్ అయింది. నైజాంలో అయితే సలార్ 100 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ కల్కి, రాజా సాబ్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇక సలార్ 2 చిత్ర షూటింగ్ కూడా సైలెంట్‌గా కానిస్తున్నట్టు తెలుస్తుంది.
అయితే ఇప్పటికీ పెళ్లి కాని ప్రసాద్‌గా ఉన్న ప్రభాస్ అమ్మాయిల గుండెలని దోచేసుకుంటూనే ఉన్నాడు. ఆయనపై లేడి ఫ్యాన్స్ తెగ ప్రేమ చూపిస్తున్నారు. తాజాగా ప్రభాస్ అభిమాని ఒకరు ఆయనపై తనకున్న అభిమానాన్ని టాటూ రూపంలో చూపించింది. ఆమె ప్రభాస్ టాటూని చేయిపై, కాళ్లపై, వేసుకోకుండా వీపుపై చాలా పెద్దదిగా వేసుకుంది. విశాలమైన వీపుపై ప్రభాస్ టాటూ అందంగా కనిపిస్తుండడంతో ఇప్పుడు ఈ ఫొటోని నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. ఈ ఫొటో బాహుబలి సినిమాలోని ప్రభాస్ నటించిన అమరేంద్ర బాహుబలి గెటప్ కాగా, ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
అయితే ఇంతకు ఆ లేడి ఫ్యాన్ ఎవరు అయి ఉంటుందని నెటిజన్స్ తెగ ఆరాలు తీస్తున్నారు. అర్ధ నగ్నంగా అలా ఫొటోని తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేయడం చూసి షాక్ అవుతున్నారు. ఆమె డేర్ నెస్‌ని, అభిమానాన్ని చూసి డార్లింగ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీనిపై ప్రభాస్ రియాక్ట్ అయితే బాగుండు అని కొందరు కామెంట్ చేస్తున్నారు. బెంగాలీ అమ్మాయి మాదిరిగా ఆమె ఉందని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.