Friday, December 27, 2024
HomeHealthConstipation problem | మీ పిల్ల‌లు మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధ‌ప‌డుతున్నారా..? అయితే ఈ చిట్కాలు పాటించండి..!

Constipation problem | మీ పిల్ల‌లు మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధ‌ప‌డుతున్నారా..? అయితే ఈ చిట్కాలు పాటించండి..!

మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌.. చాలా మంది పిల్లల్లో ఉంటుంది. రెండు, మూడు రోజుల‌కు ఒక‌సారి కూడా పిల్ల‌లు మోష‌న్‌కు వెళ్ల‌రు. ఈ స‌మ‌స్య అలానే కొన‌సాగితే.. ఇత‌ర వ్యాధులు సంభ‌వించే అవ‌కాశం ఉంటుంది. కొన్ని సంద‌ర్బాల్లో శ‌రీరం పాయిజ‌న్‌కు కూడా గుర‌య్యే ప్ర‌మాదం ఉంటుంది. కాబ‌ట్టి పిల్ల‌లు రోజు మోష‌న్ పోవాలంటే.. కొన్నిచిట్కాలు పాటిస్తే స‌రిపోతుంది. ఆహార‌పు అల‌వాట్ల‌ను మార్చుకుంటే బెట‌ర్. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచాలి. పీచు ప‌దార్థాలను అధిక మొత్తంలో తీసుకునేలా చేయాలి. దీంతో మ‌ల విస‌ర్జ‌న సాఫీగా జ‌రిగేందుకు అవ‌కాశం ఉంటుంది.

చిట్కాలు ఏంటంటే..

  • మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధ‌ప‌డే పిల్ల‌ల‌కు పొద్దున్నే ఒక గ్లాసు గోరు వెచ్చ‌ని నీటిని తాగించాలి. రాత్రంతా నాన‌బెట్టిన ఎండు ద్రాక్ష‌ల‌ను నాలుగైదు తినిపించాలి. పిల్ల‌ల‌కు రోజంతా శ‌రీరానికి స‌రిపడా నీరు తాగించాలి. ఎక్కువ నీరు తాగ‌డం వ‌ల్ల మ‌లం మృదువుగా మారి సుల‌భంగా బ‌య‌ట‌కు వెళ్లేందుకు స‌హాయ‌ప‌డుతుంది.
  • యాపిల్, క్యారెట్ వంటి ప‌దార్థాల‌ను అందించాలి. అర‌టి పండ్లు, స్ట్రాబెర్రీల‌ను పెరుగుతో మెత్త‌గా చేసి ఆ మిశ్ర‌మానికి ఒక టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్ లేదా చియా సీడ్స్‌ను క‌లిపి ఇస్తే మ‌లం సుల‌భంగా విస‌ర్జిత‌మ‌వుతుంది.
  • ప్రోబ‌యెటిక్స్ అధికంగా ఉండే పెరుగును పిల్ల‌ల‌కు ఇవ్వ‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ‌ను నియంత్రించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ‌లో ఉండే ఆరోగ్య‌క‌ర‌మైన బ్యాక్టీరియ‌ను ఇది సృష్టించి మోష‌న్ స‌క్ర‌మంగా అయ్యేందుకు దోహ‌ద‌ప‌డుతుంది.
  • పిల్లలు రోజుకు రెండుసార్లు కనీసం 10 నిమిషాలు టాయిలెట్‌లో ఉండేలా అలవాటు చేయాలి. పిల్లల్లో ఆహారం, ఆరోగ్యంపై చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు నేర్పిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఎదుగుతారన్న దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు.
RELATED ARTICLES

2 COMMENTS

Comments are closed.

తాజా వార్తలు