Sunday, December 29, 2024
HomeAndhra PradeshAP News | ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. మూడు రోజుల పాటు పెన్ష‌న్లు పంపిణీ

AP News | ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. మూడు రోజుల పాటు పెన్ష‌న్లు పంపిణీ

AP News | అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌కు అనుగుణంగా నేటి నుంచి మూడు రోజుల పాటు పెన్ష‌న్లు పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ మూడు రోజుల పాటు ఉద‌యం 8.30 నుంచి 11 గంట‌ల్లోపు డీబీటీ ద్వారా పెన్ష‌న్‌దారుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ చేయ‌నున్నారు. సీఈసీ ఆదేశాలతో ఏపీ స‌ర్కార్ ఇప్ప‌టికే ఉత్తర్వులు జారీ చేసింది. డీబీటీ పంపిణీలో ఎవరికైనా మిస్ అయితే 3వ తేదీన ఇంటికే పింఛన్‌ డబ్బులను తీసుకెళ్లి అంద‌జేయ‌నున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బ్యాకు అకౌంటు ఆధార్ లింక్ కాని వారికి ఇంటివద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేయనున్నారు.

ఏపీలో 65, 49,864 మంది పెన్షనర్లు ఉండగా.. 48, 92,503 మందికి బ్యాంకుల్లో జమ చేయనున్నారు. మిగిలిన వాళ్లకు ఇంటికి వెళ్లి పెన్షన్ అందించ‌నున్నారు. కాగా.. ఇంతకు ముందు వాలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెన్షన్ పంపిణీ నుంచి పక్కన పెట్టిన ఈసీ.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిణీ చేయాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాల నేపథ్యంలో పెన్షన్‌ పంపిణీ విధివిధానాల్లో అధికారులు మార్పులు చేపట్టారు. గత నెల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. ఈ సారి ఇబ్బంది లేకుండా.. నేడు అకౌంట్లలో డబ్బులు చేస్తారు.. ఏదైనా సమస్యలు ఉన్నవారికి నేరుగా ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తారు.

RELATED ARTICLES

తాజా వార్తలు