Wednesday, April 2, 2025
HomeTelanganaTelangana Congress | హస్తంలో రాజుకున్న కుంపటి.. చాపకింద నీరులా సీఎం వర్సెస్ సీనియర్స్..

Telangana Congress | హస్తంలో రాజుకున్న కుంపటి.. చాపకింద నీరులా సీఎం వర్సెస్ సీనియర్స్..

Click To View: JanaPadham_EPaper 13-09-2024

పండు ఫసక్కా..?!
కోటలకు బీటలేనా..?
హస్తంలో రాజుకున్న కుంపటి..
చాపకింద నీరులా సీఎం వర్సెస్ సీనియర్స్..
ఏపీలో ఉత్తమ్…ఢిల్లీ లో రేవంత్
కాంగ్రెస్ (Telangana Congress) లో పీక్స్ కు చేరిన పంచాయితీ
చంద్రబాబు ఉత్తమ్ దంపతుల భేటీ.. రేవంత్ పై ఫిర్యాదులు
ఉత్తమ్ పై రేవంత్ నిఘా

పండు పక్వానికి వచ్చినట్టుగానే అనిపిస్తున్నది. పైకి పచ్చగానే కనిపిస్తున్న లోపల మాత్రం కుళ్లుతున్న వాసన స్పష్టంగా తెలుస్తున్నది. అవకాశం కోసం కాచుక్కూర్చున్న సీనియర్లకు, ఎప్పుడేం జరుగుతుందో తెలియక సీఎంకు మధ్య ఊబి ఊగిసలాడుతున్నది. అంతా భేష్ గానే ఉన్నట్టుగా హైకమాండ్ కు కలరింగ్ ఇస్తున్నా, లోపల మాత్రం కొరికి చంపుకునేంత పగలతో రగిలిపోతున్న వైరి వర్గాలు స్నేహాన్ని నటిస్తున్న ఆనవాళ్లు ఇట్టే తెలిసిపోతున్నాయి. గురువుకు శిష్యుడి గురించి చెప్పేందుకు ‘సిపాయి’ వెళ్లగా, సోల్డర్ ఏదో చేస్తున్నాడు కాస్త కన్నేసి ఉంచాల్సిన సందర్భమని హస్తినా నుంచి అనుచరులను పురమాయించుకున్న అవసరం ఆయనది. కాంగ్రెస్ ఎప్పుడూ ఒక్కరితో కొసెళ్లుడు కష్టమే అనే ఆనవాయితీని మరోమారు నిజం చేసేందుకు ఎవరికి వారుగా ఓ చెయ్యేసేందుకు వెనకాడని పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయం కాక రేపుతున్నది.
=======================
కాంగ్రెస్ లో కుమ్ములాట క్లైమాక్స్ కు వచ్చినట్టే అనిపిస్తున్నది. సీనియర్లు వర్సెస్ సీఎంగా ఉన్న ఆట ఇప్పుడు ఉత్తమ్ వర్సెస్ ముఖ్యమంత్రిగా మారినట్టుగా తోస్తోంది. ముఖ్యమంత్రి ఢిల్లీలో పర్యటిస్తుండగా, ఉత్తమ్ అండ్ ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. రేవంత్ రెడ్డి అతిని ఆయనకు గురువుగా అభివర్ణించే ఏపీ సీఎం చంద్రబాబుకు చెప్పడానికి వెళ్లినట్టు సమాచారం. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ దూకుడు, హైడ్రా పేరుతో సీనియర్లను, ఇతర ప్రముఖులను ఇబ్బంది పెట్టే తీరును పూసగుచ్చినట్టు చెప్పి, కాస్త కళ్లెం వేయడానికి పూనుకోవాలని కోరినట్టు సమాచారం.

కోటలకు బీటలేనా..?
క్లైమాక్స్ కాంగ్రెస్ పాలిటిక్స్. వర్గ పోరు రాష్ట్రం ఎల్లలు దాటున్నదా..? గ్రూపు రాజకీయాలు ముష్టి యుద్ధాల దాకా వెళ్తున్నాయి. విస్తరణకు ముందే ముఖ్యమంత్రి సీటుకే ఉత్తమ్ కోటరీ ఎసరు పెట్టబోతుందా..? త్వరలో నంబర్ గేమ్ కు కూడా సిద్దపడుతున్న దాఖలాలు సుస్పష్టం. లోపల ఎన్నైనా ఉండొచ్చుగానీ ఇప్పటి వరకు రాష్ట్ర కాంగ్రెస్ ఓ తొనగని కుండ మాదిరి బిల్డప్ తో నడక సాగిస్తున్నది. ఇక సర్కార్ కు సీనియారిటీ పెరుగుతుండడంతో అటు మంత్రులు, ఇటు ముఖ్యమంత్రి ఎవరికి వారుగా సొంత బలం పెంచడానికి ప్రాధాన్యం ఇస్తున్న చాయలు కనిపిస్తున్నాయి. స్వంతంత్ర నిర్ణయాలను పెద్దల సమక్షంలో పంచుకుంటూ ఒఖరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నంత పనిచేస్తున్నారు.

హస్తంలో రాజుకున్న కుంపటి..
సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణ, రాష్ట్రానికి పంట నష్టం సాయం, వరద సాయం కోసం ఢిల్లీలో మకాం వేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యతో కలిసి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును కలిశారు. రేవంత్ తీసుకుంటున్న ఒంటెత్తు పోకడలతో రాష్ట్రంలో పరిస్థితులు గందరగోళంగా మారుతున్నాయని, పెద్ద తలలుగా పరిగణించే వారు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. మరీ ముఖ్యంగా హైడ్రా తో రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖుల పునాదులు కదులుతున్నాయని, ఆ విషయంలో సీఎం ఎవరు చెప్పినా వినే దాఖలాలు కనిపించడం లేక తప్పనిసరై బాబుతో చెప్పుకొచ్చినట్టు సమాచారం.

చాపకింద నీరులా సీఎం వర్సెస్ సీనియర్స్..
సీఎం రేవంత్ రెడ్డి పైకి ప్రజాస్వామ్యయుతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం., కేబినెట్ తో చర్చిస్తున్నాం., సహచర మంత్రులతో మాట్లాడుతున్నామని చెప్పుకుంటున్నా., లోలోపల మాత్రం కొన్ని వ్యక్తిగతంగా అమలు చేస్తున్నారని సీనియర్లు ఆరోపిస్తున్నారు. అసలు విషయాలు బయటకు పొక్కకుండా కేవలం కొన్ని లీకులిచ్చి ఆయన సొంత నిర్ణయాలనే అమలు చేసేలా యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని పేర్కొంటున్నారు. దీంతో ఇటు సీనియర్ మంత్రులకు, అటు సీఎం కుమధ్య అగాధం తెలియకుండానే పెరుగుతున్నది. అసలే కాంగ్రెస్ అలాంటి పార్టీలో జూనియర్, సీనియర్ తేడాలు అత్యంత క్లియర్. నిన్నగాక మొన్నొచ్చిన వ్యక్తి ఇప్పుడు లీడర్ షిప్ తో నెత్తికెక్కి నాట్యం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని పలువురు మంత్రులు అనుచరుల వద్ద పేర్కొన్నట్టు సమాచారం.

చంద్రబాబు ఉత్తమ్ దంపతుల భేటీ.. రేవంత్ పై ఫిర్యాదులు
ఏపీ సీఎం చంద్రబాబుతో ఉత్తమ్ దంపతుల భేటీ రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఓ వైపు రేవంత్ హస్తినాలో ఉండగా ఆయన కేబినెట్ లోని కీలక నేత అందునా తనకు గురువుగా యావత్ రాజకీయ ప్రముఖులు పేర్కొనే చంద్రబాబుతో భేటీ కావడమే ఇప్పుడు హాట్ టాపిక్. ముమ్మాటికి రేవంత్ అతి తనం, దూకుడుతో పెద్దలను కూడా పట్టించుకోని మొండితనంపైనే వివరించి, పలు ఫిర్యాదులను ఆయన ముందించినట్ట సమాచారం.
అదే సమయంలో రేవంత్ కూడా ఉత్తమ్ కదలికలపై నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ఎన్నటికైనా తనకు త్రెడ్ ఉండబోయేది ఆయనతో అనే అనుమానంతో ఉన్న సీఎం కనిపెట్టుకుని ఉన్నట్టు సమాచారం. ప్రతి కదలికను తెలుసుకుంటూ అవసరమైన వేళ పావులు కదిపేలా సిద్ధంగా ఉన్నట్టు వినికిడి.

RELATED ARTICLES

తాజా వార్తలు